Kodaikanal Tour : ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్‌గా ప్రసిద్ధి చెందిన కొడైకెనాల్(Kadaikanal Trip) పర్యాటకులకు బెస్ట్ స్పాట్. సుందమైన ప్రకృతి, లోయలు, సుందరమైన జలపాతాలు(Water Falls), రోలింగ్ హిల్స్, స్పష్టమైన సరస్సులు అన్నీ కలిసి పర్వత విహారానికి మీ వేసవి ట్రిప్ కు చక్కటి ప్రదేశం. కొడైకెనాల్ మీ రోజువారీ నగర జీవితంలోని కష్టాల నుంచి విశ్రాంతి తీసుకోవడానికి బెస్ట్ ప్లేస్. ఈ హిల్ స్టేషన్ లో బైకింగ్ లేదా ట్రెక్కింగ్(Trekking) ట్రయల్స్‌లో బయలుదేరినప్పుడు లేదా చుట్టుపక్కల ఉన్న భారీ అడవులలో షికారు చేస్తున్నప్పుడు మీరు ప్రకృతితో కనెక్ట్ అయిపోతారు. చెన్నై నుంచి ఐదు రోజుల కొడైకెనాల్ టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ(IRCTC Package) అందిస్తుంది. ప్రతీ గురువారం ఈ టూర్ అందుబాటులో ఉంటుంది.