తాడేపల్లిలోని ఉండవల్లి సెంటర్ అయ్యప్ప స్వామి గుడి సమీపంలో బుల్లెట్ బైకు దొంగతనం జరిగింది. అర్ధరాత్రి ముగ్గురు యువకులు వచ్చి.. పక్కా ప్రణాళిక వేసి బైకును దొంగలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ టీవీలో రికార్డ్ అయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే తరచుగా ఈ ప్రాంతంలో దొంగలు పడటంతో స్థానికులు హడలిపోతున్నారు. పోలీసుల సరైన పర్యవేక్షణ లేకపోవటంతోనే దొంగతనాలు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.