ఏం తినాలి?
గర్భిణులు వేసవిలో పుచ్చకాయలను ప్రతిరోజూ తినాలి. ఈ పండ్లు డీహైడ్రేషన్ రాకుండా అడ్డుకుంటాయి. శరీరంలో హైడ్రేషన్ స్థాయిలను పెంచుతాయి. నిమ్మకాయ రసం, కివీ పండ్లు, జామ, పీచ్, రేగు పండ్లు అధికంగా తింటూ ఉండాలి. వీటన్నింటిలో కూడా ఇనుము అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఐరన్, ఫైబర్ అధికంగా ఉండే ఆపిల్ పండ్లు ప్రతిరోజూ రెండు తినడం చాలా అవసరం. అలాగే రోజుకో అవకాడో పండు తింటే మంచిది. దీనిలో మంచి కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇక రోజుకు రెండు అరటిపండ్లు కూడా తినాలి. మామిడి పండ్లు తినడం వల్ల విటమిన్ ఏ, విటమిన్ సి పోషకాలు పుష్కలంగా అందుతాయి. అలాగే నీళ్లు అధికంగా తాగుతూ ఉండాలి. లస్సీ, కొబ్బరి నీరు, మజ్జిగ వంటివి అధికంగా తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.