నాచురల్ డైలాగ్స్…
డబ్బింగ్ సినిమాల్లో శ్రీరామకృష్ణ రాసిన డైలాగ్స్ ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. డబ్బింగ్ అనే ఫీల్ కలకుండా సహజంగా డైలాగ్స్ రాయడం శ్రీరామకృష్ణ ప్రత్యేకతగా చెబుతుంటారు. శంకర్ సినిమాల్లో పొలిటికల్ డైలాగ్స్‌ను పవర్‌ఫుల్‌గా రాయడం…మణిరత్నం సినిమాల్లో ప్రేమ డైలాగ్స్‌ను హృదయాలకు హత్తుకునేలా రాయడం శ్రీరామకృష్ణకే చెల్లింది. రజనీకాంత్, కమల్ హాసన్ , విక్రమ్, అజిత్ వంటి స్టార్ హీరోలందరి డబ్బింగ్ సినిమాలకు శ్రీరామకృష్ణ డైలాగ్ రైటర్‌గా పనిచేశారు.