ఎమ్మెల్యే కడియం శ్రీహరి వైఖరి వల్లే వరంగల్ జిల్లాలో తాడికొండ రాజయ్య, ఆరూరి రమేశ్ BRSను వీడారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. BRSలో సభ్యత్వం లేని కావ్యకు కేసీఆర్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. మిలియన్ మార్చ్‌లో కేకేను కోడిగుడ్లతో కొట్టిన ఘటనను బాలకిషన్ గుర్తు చేశారు. కేశవరావు బిడ్డ గద్వాల విజయలక్ష్మి ఎవరికీ తెలియదన్నారు. ఓట్ల కోసం గద్దర్‌ను వాడుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మండిపడ్డారు.