ఏపీలో ఎన్నికల హడావుడి పెరిగింది. ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు నేతలు ఎన్నికల పీట్లు చేస్తున్నారు. ఎప్పుడూ వార్తల్లో నిలిచే మంత్రి అంబటి రాంబాబు.. ఈ సారి ఎన్నికల్లో బస్సులో ప్రచారం చేశారు. సత్తెనపల్లి పట్టణంలో RTC బస్సు ఎక్కి మంత్రి ప్రచారం చేశారు. YCP ఎన్నికల కరపత్రాలు పంచి సంక్షేమ పథకాలు తెలుపుతూ మరోసారి వైసీపీ ని గెలిపించాలని కోరారు. దీనికి సంబందించిన వీడియో చక్కర్లు కొడుతుంది.