Home లైఫ్ స్టైల్ నా భర్త మూడు సార్లు మోసం చేశాడు, నాలుగోసారి కూడా తప్పు చేసి క్షమించమంటున్నాడు, ఏం...

నా భర్త మూడు సార్లు మోసం చేశాడు, నాలుగోసారి కూడా తప్పు చేసి క్షమించమంటున్నాడు, ఏం చేయాలి?-relationshipsmy husband has cheated three times he is wrong even for the fourth time and apologizes what should i do ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

మీ వివాహాన్ని పదిలంగా ఉంచుకునేందుకు మీరు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీ భర్త ప్రతిసారి మీ ప్రయత్నాన్ని వమ్ము చేస్తున్నాడు. మీ భర్తకు ఉన్న చెడు తిరుగుళ్ళ కారణంగా మీరు మీ పిల్లలు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. ముందుగా మీ కుటుంబానికీ, అతని కుటుంబానికీ ఈ విషయాన్ని చేరవేయండి. పెద్దలలోనే చివరిసారిగా మాట్లాడండి. అతనితో ఏం మాట్లాడాలనుకుంటున్నారో అన్నీ మీ పెద్దల ముందే మాట్లాడండి. ఇది చివరి అవకాశమని చెప్పండి. ఇంకొక్కసారి మిమ్మల్ని మోసం చేస్తే పిల్లలతో పాటూ వేరుగా జీవిస్తానని చెప్పండి. ఇందుకోసం మీ అత్తయ్య, మావయ్య, మీ తల్లిదండ్రుల సహకారం మీకు చాలా అవసరం. మీరు నిస్సహాయంగా ఉండిపోవద్దు. కాస్త తెలివితేటలు ఉంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని కూడా జీవించేవారు ఎంతోమంది ఉన్నారు. తల్లిదండ్రులు, అన్నదమ్ముల అండ కాస్త ఉంటే చాలు మీ పిల్లల్ని ధైర్యంగా పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇలా మోసం చేసే భాగస్వామితో జీవితాంతం బతకమని ఎవరూ చెప్పరు. ఇప్పటికి మూడుసార్లు అతనికి అవకాశం ఇచ్చారు. ఇక నాలుగోసారి పెద్దల సమక్షంలో చివరి అవకాశం ఇవ్వండి. అదే తప్పు మళ్లీ చేస్తే అతనికి దూరంగా విడిగా పిల్లలతో కలిసి బతకడమే మేలు.

Exit mobile version