Vijay Deverkonda in TV Shows: ఫ్యామిలీ స్టార్ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 5వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. గీతగోవిందం తర్వాత విజయ్ – పరశురామ్ కాంబో మరోసారి రిపీట్ అవుతోంది. పాటలు, ట్రైలర్‌తో ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ మూవీపై మంచి హైప్ ఏర్పడింది. అలాగే, ప్రమోషన్లను కూడా జోరుగా చేస్తోంది మూవీ టీమ్. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ టీవీ షోల్లోనూ పాల్గొంటున్నారు. ఉగాది సందర్భంగా రానున్న రెండు స్పెషల్ టీవీ షోల్లో వారిద్దరూ సందడి చేశారు. ఆ టీవీ షోలు, టెలికాస్ట్ టైమింగ్స్ వివరాలు ఇవే..