Nothing Phone 3 price in India : నథింగ్ ఫోన్.. పలు రకాల జంతువుల నుంచి ప్రేరణ పొందుతూ వస్తోంది. ఫస్ట్ జనరేషన్ ఫోన్ని చిలుకతో టీజ్ చేసింది సంస్థ. నథింగ్ ఫోన్ 2ను ఆక్టోపస్తో ప్రదర్శించారు. నథింగ్ ఫోన్ 3 టీజర్ లో కప్ప, బగ్ ఉండటం కొత్త తరం స్మార్ట్ఫోన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు, గ్యాడ్జెట్ కొనుగోలుదారుల్లో క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది. స్పెసిఫికేషన్లు, డిజైన్, కెమెరా లేదా కొన్ని కొత్త ఏఐ ప్రకటనల పరంగా నథింగ్ ఫోన్ 3లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వివరాలన్నీ తెలియాలంటే కంపెనీ అఫీషియల్ లాంచ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..