Home తెలంగాణ ఫ్రస్ట్రేషన్ లో కేశినేని నాని.. మూడు నెలలు పెన్షన్లు రావంటూ బెదరింపులు | kesineni nani...

ఫ్రస్ట్రేషన్ లో కేశినేని నాని.. మూడు నెలలు పెన్షన్లు రావంటూ బెదరింపులు | kesineni nani in frustration| threat| penssions| stop| three| months| ec| orfer

0

posted on Apr 1, 2024 12:04PM

తెలుగుదేశంతో కేశినేని నాని పొలిటికల్ జర్నీ బ్రేక్ అయిన క్షణం నుంచీ ఆయన తన రాజకీయ భవిష్యత్ పై ఆందోళనలో ఉన్నారు. వరుసగా రెండు సార్లు ఎంపీ కావడానికి కారణమైన తెలుగుదేశం పార్టీని అహంభావంతో వీడి.. వైసీపీ గూటికి చేరిన కేశినేని నానికి… ఇప్పుడు భవిష్యత్ గందరగోళంగా కనిపిస్తోంది. పార్టీని వీడి విజయవాడ ఎంపీగా వైసీపీ తరఫున పోటీ చేయడానికి  టికెట్ సంపాదించుకున్నా.. గెలిచే అవకాశాలు ఇసుమంతైనా కనిపించకపోవడంతో ఫస్ట్రేషన్ పీక్స్ కు చేరింది. దీంతో ఈసీ ఆదేశాలకు సైతం వక్రభాష్యాలు చెబుతూ జనాలను బెదరించడానికి కూడా వెనుకాడటం లేదు.  

విజయవాడ లోక్ సభ నియోజకవర్గంలో తెలుగుదేశంను కాదని విజయం సాధించడం సాధ్యం కాదన్న విషయం రోజు రోజుకూ విస్పష్టంగా అర్ధమౌతుండటంతో ఆయనలో నిరాశ నిస్ఫృహలు నెలకొన్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు ఆయన మాటలను ఉటంకిస్తూ విశ్లేషణలు చేస్తున్నారు. తాజాగా వాలంటీర్లను పించన్ల పంపిణీకి దూరంగా ఉంచాల్సిందేనంటూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై నాని చేసిన వ్యాఖ్యలకు ఆయన నమ్ముకుని వచ్చిన వైసీపీ నుంచీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వచ్చే మూడు నెలల వరకూ వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు రావనీ, వాళ్లు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందనీ కేశినేని నాని హెచ్చరిస్తున్నారు.

ఒక విధంగా వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలంటూ ఈసీ ఆదేశాలకు  తెలుగుదేశం పార్టీ వాలంటీర్లపై ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులే కారణమని చెబుతున్నారు.  పేదులు ఇబ్బందులు పడతారు, మూడు నెలలు పింఛన్లు అందకపోతే  మందులు, ఇతర నిత్యావసరాల కొనుగోలుకు వారి వద్ద డబ్బులు ఉండవు అంటూ మీడియా సమావేశంలో కేశినేని చెప్పారు.  అయితే పింఛన్ల పంపిణీని నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించలేదు. ఆ పంపిణీ నుంచి వాలంటీర్లను మాత్రమే దూరం పెట్టింది. అలాగే పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరం చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులలో  వీటిని ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని విస్పష్టంగా పేర్కొంది.    ఓటర్లను ప్రభావితం చేయకుండా ఉండేందుకు వాలంటీర్లను మాత్రమే నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆ ఆదేశాలకు కేశినేని నాని వక్రభాష్యం చెబుతున్నారు.  కేశినేని నాని చెప్పిన దాని ప్రకారం  జగన్ పింఛన్లు నిలిపివేయాలని లేదా పంపిణీలో మరిన్ని ఇబ్బందులు సృష్టించాలని అధికారులను ఆదేశించారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్ కు అలా   ఆదేశాలిచ్చే అధికారాలు లేవు. అయినా అధికారులలో తనకు తొత్తులుగా ఉన్నవారి ద్వారా ఇటువంటి ఆదేశాలు అమలు అయ్యేలా ఏమైనా కుట్రలకు తెరతీశారా అన్న అనుమానాలూ వ్యక్తమయ్యేలా కేశినేని మాటలు ఉన్నాయి.    పింఛన్లు సక్రమంగా అందకుండా అవరోధాలు సృష్టించడం ద్వారా వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుందని , కుట్రపూరితంగా ప్రతిపక్షాలు వాలంటీర్లపై ఆరోపణలు, ఫిర్యాదులు గుప్పించి, ఆ వ్యవస్థను స్తంభింప చేసి ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేశారనీ జనం అనుకునేలా చేయాలన్న లక్ష్యంతో జగన్  కుట్రలు చేస్తున్నారా అన్న అనుమానాలు తావిచ్చేలా కేశినేని నాని మాటలు ఉన్నాయన్న విమర్శలు అన్ని వర్గాల నుంచీ వ్యక్తం అవుతున్నాయి. కేశినేని తన వ్యాఖ్యల ద్వారా.. జగన్ ప్లాన్ బయటపెట్టేసినట్లైందని వైసీపీ వర్గాలు సైతం నానిపై గుర్రుగా ఉన్నారు.

మొత్తం మీద వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు అందవంటూ కేశినేని చేసిన వ్యాఖ్యలు ఒక విధంగా జగన్ సర్కార్ ఎత్తుగడను దెబ్బ తీశాయని పరిశీలకులు అంటున్నారు. ఈ విషయమై ఇప్పుడు తెలుగుదేశం సీరియస్ గా  సీఎస్ కు, ఎన్నికల సంఘానికి లేఖలు రాయడం ద్వారా విషయాన్ని పబ్లిక్ చేశాయనీ, ఇప్పుడు ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని అర్హులందరికీ పింఛన్లు నేరుగా ఇళ్ల వద్దనే అందించాలంటూ ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయనీ అంటున్నారు.  

Exit mobile version