Home బిజినెస్ HDFC Bank : హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ యూజర్స్​కి అలర్ట్​- మీ జీతం ఆలస్యం అవ్వొచ్చు!

HDFC Bank : హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ యూజర్స్​కి అలర్ట్​- మీ జీతం ఆలస్యం అవ్వొచ్చు!

0

HDFC Bank service alert : దేశీయ దిగ్గజ ప్రైవేట్​ బ్యాంకింగ్​ సంస్థ హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​.. ఓ కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్​ 1న.. నెఫ్ట్​ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్​ఫర్​) సేవలు పనిచేయవని వెల్లడించింది. ఆర్థిక ఏడాది ముగింపు కారణంగా పలు ప్రక్రియలను పూర్తి చేసే క్రమంలో.. నెఫ్ట్​ సేవల్లో జాప్యం చోటుచేసుకోవచ్చని స్పష్టం చేసింది. అందుకే.. యూజర్లు హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ నెఫ్ట్​ సేవలను సోమవారం ఒక్కరోజు వాడకూడదని పేర్కొంది. ఫలితంగా.. నెఫ్ట్ ద్వారా నెల మొదటి రోజు జీతాలు పొందే వారికి.. ఈసారి శాలరీలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్ లేదా యూపీఐ వంటి ఇతర చెల్లింపు సేవలు యథావిధిగా పనిచేస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది.

Exit mobile version