Home తెలంగాణ రామభక్తులకు గుడ్ న్యూస్, హైదరాబాద్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ విమాన సేవలు-hyderabad to ayodhya commercial...

రామభక్తులకు గుడ్ న్యూస్, హైదరాబాద్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ విమాన సేవలు-hyderabad to ayodhya commercial flight service starts from april 2nd weekly thrice ,తెలంగాణ న్యూస్

0

స్పైస్ జెట్ డైరెక్ట్ విమాన సేవలు

అయోధ్య (Ayodhya Ram Mandir)ను ఎనిమిది నగరాలతో కలిపే స్పైస్ జెట్ (Spice Jet)డైరెక్ట్ విమాన సర్వీసును ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath), కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి వీకే సింగ్ ఇటీవ ప్రారంభించారు. ఈ విమానాల రాకపోకలతో భక్తులు, పర్యాటకులకు అయోధ్య శ్రీరామ లల్లా దర్శనం సులభమవుతుంది. అయోధ్యలో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని డిసెంబర్ 30, 2023న ప్రధాని మోదీ ప్రారంభించారు. స్పైస్ జెట్ ఇప్పుడు దర్భాంగా, అహ్మదాబాద్, చెన్నై, జైపూర్, పాట్నా, దిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల నుంచి అయోధ్యకు నాన్ స్టాప్ డైరెక్ట్ ఫ్లైట్ లను నడుపుతోంది. అయోధ్యకు నాన్ స్టాప్ విమాన సర్వీసులు ప్రారంభం కావడం వల్ల అయోధ్య కనెక్టివిటీ పెరగడమే కాకుండా పర్యాటక రంగం అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ తెలిపారు.

Exit mobile version