48 గంటల్లో ప్రభుత్వం కూలడం ఖాయం- ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) లాంటి వాళ్లు తమతో ఆరు మంది మంత్రులు టచ్ లో ఉన్నారని, మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకోవాలని ప్రయత్నించినా 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) కూలిపోవడం ఖాయమన్నారు బీజేపీ లెజిస్లేటివ్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Maheswar Reddy)అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు(Note For Vote) భయం పట్టుకుందని, దాంతో ఆయనకు నిద్ర కూడా పట్టడం లేదన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ్ముడే ఆయనతో టచ్ లో లేడని…..రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మికి ఎంపీ టిక్కెట్ రాకుండా అడ్డుకుంది కూడా వెంకట్ రెడ్డే అన్నారు. ఒకప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యకుండా వేరే పార్టీలో చేరే వారిని చెప్పుతో కొట్టాలి అన్న ఇదే రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరుతున్న వారిని చెప్పుతో కొడతాడా? అని ప్రశ్నించారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి(Ranjith Reddy)పై అనేక అవినీతి ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయనకు టికెట్ ఎలా కేటాయించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విచారణల పేరుతో రేవంత్ రెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి దమ్ముంటే భువనగిరి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకావాలని సవాల్ విసిరారు.