Home క్రికెట్ MS Dhoni CSK : ఐపీఎల్​ని ధోనీ మధ్యలోనే వదిలేస్తాడా? ఫ్యాన్స్​కి మరో షాక్​ తప్పదా?

MS Dhoni CSK : ఐపీఎల్​ని ధోనీ మధ్యలోనే వదిలేస్తాడా? ఫ్యాన్స్​కి మరో షాక్​ తప్పదా?

0

CSK vs RCB highlights : మహేంద్ర సింగ్​ ధోనీ ఏ నిర్ణయం తీసుకున్నా అది షాకింగ్​గానే ఉంటుంది! అతని ఫ్యాన్స్​ షాక్​కి గురైన సందర్భాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో ఒకటి.. ఇటీవలే జరిగింది. ఐపీఎల్​ 2024లో చెన్నై సూపర్​ కింగ్స్​ కెప్టెన్సీకి గుడ్​ బై చెప్పేశాడు ధోనీ. దీనిని ఫ్యాన్స్​ ఇంకా జీర్ణించుకోలేకపోతున్న సమయంలోనే.. వారికి కాస్త బాధ కలిగించే వార్త మరొకటి బయటకు వచ్చింది. ఐపీఎల్​లో ధోనీ అన్ని మ్యాచ్​లు ఆడకపోవచ్చని.. వెస్టిండీస్​ దిగ్గజం, ఆర్​సీబీ మాజీ బ్యాటర్​ క్రిస్​ గేల్​ అభిప్రాయపడ్డాడు.

Exit mobile version