Holika dahan ash benefits: హోలీ పండుగకు ముందు రోజు హోలికా దహనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకత ఈ వేడుక జరుపుకుంటారు. భద్ర నీడలేని సమయంలో హోలికా దహన్ నిర్వహిస్తారు. అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ కష్టాలు తొలగిపోవాలని వేడుకుంటారు. హోలికా దహనం అగ్నిలో ఆవు పేడతో చేసిన పిడకలు, విరిగిపోయిన వస్తువులు, ఎండిన కొమ్మలు వంటివి వేసి అగ్నిని వెలిగిస్తారు. దీని నుంచి వచ్చే బూడిదకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ బూడిదను ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు.