“ఈ రోజుల్లో నుంచి బేబీ వరకు నిర్మాతగా నా ప్రయాణం, దర్శకుడిగా మారుతి ప్రస్థానం, శ్రీనివాస్ కెరీర్ ఎంతో సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. ఇది కేవలం రీ రిలీజ్ మాత్రమే కాదు. పుష్కర కాలంలో మా కెరీర్లో ఎలా ఎదిగాం అని చూసుకునే తీపి గుర్తు ఈ సినిమా. ఈ సినిమా విడుదలైన తరువాత సినీ పరిశ్రమలో రూ. 50 లక్షలతో ఎలా సినిమా తీశారు.. అంటూ మా ప్రతిభను గుర్తించారు. ఎంతో మంది వాళ్ల సహకారం అందించారు. ఇలాంటి సినిమా మళ్లీ వెండితెరపై చూసుకోవడం ఆనందంగా ఉంది” అని నిర్మాత ఎస్కేఎన్ తెలిపారు.