సాధారణ పౌరులకు న్యాయం అందించడమే లక్ష్యం
‘‘న్యాయమూర్తిగా 24 సంవత్సరాల అనుభవం ఉంది. నేను కోర్టు నుంచి బయటకు రాలేదు. నేను నా సీట్ పొజిషన్ ను మార్చుకున్నాను, అంతే. దానికే, నేను తీవ్రమైన వేధింపులు, ట్రోలింగ్ కు గురయ్యాను” అని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ (CJI Chandrachud) విచారం వ్యక్తం చేశారు. ఈ ఒత్తిళ్ల మధ్యనే సాధారణ పౌరులకు శ్రద్ధగా సేవ చేయడానికి న్యాయవ్యవస్థ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. సాధారణ పౌరులకు న్యాయం అందించాల్సిన బాధ్యతను మోయాల్సిన తమ భుజాలు, అందుకు వీలుగా విశాలంగానే ఉన్నాయన్నారు. విధుల్లో ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ.. ప్రజలకు న్యాయం అందించే విషయంలో ముందుండాలని ఆయన న్యాయాధికారులకు సూచించారు. ఒత్తిడిని ఎదుర్కోవడం, వ్యక్తిగత – వృత్తిగత జీవితాల మధ్య సమతుల్యతను సాధించడం న్యాయాధికారులకు చాలా అవసరమన్నారు.