Rakshit Atluri Sasivadane: పలాస 1978 సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రక్షిత్ అట్లూరి. ఇప్పుడు రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా శశివదనే. ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించిన ఈ సినిమాను గౌరీ నాయుడు సమర్పిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు.