శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం టికెట్ జనసేనకే కేటాయించాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. TDP లేదా బీజేపీకి ఈ సీటు కేటాయిస్తే మరోసారి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు వస్తాయని చిలకం సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరంలో అందరూ ఆహ్వానించే పార్టీ జనసేన అని అన్నారు. వైసీపీతో పోరాటం చేసిన పార్టీ జనసేన అని, తనకే సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.