రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ ఈఏపీ సెట్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 8 నుంచి 12 వరకు విద్యార్థులు దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. రిజిస్ట్రేషన్(TS EAPCET 2024 Registration) సమయంలో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వివరాలను సమర్పించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అభ్యర్థులు రూ.250 ఆలస్య రుసుము చెల్లించి ఏప్రిల్ 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 లేట్ ఫీజుతో ఏప్రిల్ 14 లోపు అప్లై చేసుకోవచ్చు. ఆలస్య రుసుము రూ.2500తో ఏప్రిల్ 19 వరకు, రూ.5 వేల ఆలస్య రుసుముతో మే 4వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. మే 1 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక గతంలో ఎంసెట్ గా ఉన్న పేరు TS EAPCETగా మారిన సంగతి తెలిసిందే.