Moongdal Rasagulla: గులాబ్ జామూన్‌లు, రసగుల్లాలు చూస్తేనే నోరూరిపోతాయి. అవి మెత్తగా, జ్యూసీగా ఉంటాయి. అలాంటి కోవకే చెందుతుంది మూంగ్ దాల్ రసగుల్లా కూడా. ఇది నోట్లో పెట్టగానే కరిగిపోయేటట్టు ఉంటుంది. పిల్లలకు, పెద్దలకు చాలా నచ్చుతుంది. దీనిలో పెసరపప్పు, పనీర్ ఎక్కువగా వాడతాము. ఇది డిజర్ట్ కోవలోకే వస్తుంది. హోలీ, దీపావళి వంటి పండగలు వచ్చినప్పుడు ఈ పెసరపప్పు రసగుల్లాను ఒకసారి ప్రయత్నించండి. జ్యూసీగా, టేస్టీగా ఉంటుంది.