posted on Mar 22, 2024 9:30AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శుక్రవారం(మార్చి 23) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 23 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం (మార్చి 22) శ్రీవారిని మొత్తం 60వేల 485 మంది భక్తులు దర్శించుకున్నారు.
వీరిలో 23851 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల లక్ష రూపాయలు వచ్చింది.