ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ ను కిడ్నాప్ చేశారు. రెండు రోజుల క్రితం అమెరికాకు చెందిన ఓ ఫోన్ నంబరు నుంచి అబ్దుల్ తండ్రి సలీంకు ఫోన్ చేసి కిడ్నాపర్లు డబ్బులు డిమాండ్ చేశారు. మీ కుమారుడ్ని కిడ్నాప్ చేశామని.. వెంటనే 1200 డాలర్లు పంపకపోతే అతన్ని కిడ్నీలు తీసుకునే మాఫియాకు అప్పగిస్తామని బెదిరించారని సలీమ్ ని బెదిరించారు. అయితే తమ కుమారిడిని ఎలాగైనా కాపాడాలని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనతో వేడుకుంటున్నారు.