ఇలా చెక్ చేసుకోండి…
- పరీక్ష రాసిన అభ్యర్థులు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ https://portal-psc.ap.gov.in/Default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లండి.
- హోంపేజీలో కనిపించే Selection Notification to the post Assistant Motor Vehicle Inspector in A.P. అనే లింక్ పై క్లిక్ చేయండి.
- మీకు జాబితా ఓపెన్ అవుతుంది. ఇందులో మీ రూల్ నెంబర్స్ ఉంటాయి.
- జోన్ల వారీగా ఫలితాలను అందుబాటులో ఉంచారు.
గ్రూప్ 1 కేసు… డివిజన్ బెంచ్ కీలక ఉత్తర్వులు…
AP High Court on Group1: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల్ని రద్దు చేేస్తూ హైకోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ Division Banch స్టే విధించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 2018లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ మెయిన్స్ పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. మెయిన్స్‌పేపర్లను మూడు సార్లు దిద్దారని, నోటిఫికేషన్‌లో లేని విధంగా డిజిటల్ మూల్యంకనం చేశారని, కోర్టు ఆదేశాలతో మరో రెండు సార్లు మాన్యువల్ పద్ధతిలో మూల్యాంకనం చేశారని, ఈ క్రమంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ క్రమంలో మంగళగిరిలో రెండు సార్లు మూల్యాంకనం చేసినట్టు ఆధారాలను సమర్పించడంతో మార్చి13న సింగల్ బెంచ్ 2018 గ్రూప్1 నియామకాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. పరీక్షల్లో నిర్వహణలో కమిషన్ విఫలం అయ్యిందని అభిప్రాయపడింది. లోపాల కారణంగా 2018 నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవహారంపై ఏపీపీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. దీంతో విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు 2018 నియామకాల్లో ఉద్యోగాల్లో చేరిన వారు విధుల్లో కొనసాగవచ్చని స్పష్టత ఇచ్చింది. కేసు విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది