Monday, January 13, 2025

రైతాంగం ను ముంచిందే బి.ఆర్.ఎస్-బిజెపి

  • రైతాంగం ను ముంచిందే బి.ఆర్.ఎస్-బిజెపి
  • రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది
  • పార్లమెంట్ ఎన్నికల కోసమే ఎర్రబెల్లి.. కేటీఆర్, హరిశ్ డ్రామాలు.
  • తెలంగాణ లో మతతత్వ రాజకీయాలకు చోటు లేదు.
    రాష్ట్రంలో 15 ఎంపీలు గెలుస్తాం..కేంద్రంలో రాహుల్ నే ప్రధాని.
    రైతాంగం అభివృద్ధి పై చర్చకు సిద్ధమా??
  • తెలంగాణ స్టేట్ కో ఆఫరెటీవ్ ఆయిల్ సీడ్స్ &గ్రోవర్స్ ఫెడరేషన్ కార్పోరేషన్ ఛైర్మన్ జంగా రాఘవ రెడ్డి

అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు పంట నష్టం పై అంచనా వేయాలని అధికారులను ఆదేశించారని జంగా రాఘవ రెడ్డి పేర్కొన్నారు.గురువారం ఆయన కాజీపేట లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.బి.ఆర్.ఎస్.-బిజెపి ప్రభుత్వాలు పదేళ్లపాటు అస్తవ్యస్త విధానాలతో రైతాంగం నడ్డి విరిచారాని జంగా మండిపడ్డారు.గతంలో పదేళ్లుగా ఏనాడు రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ ఇవ్వకుండ ఇవాళ కల్వకుంట్ల తారకరామారావు,హరీష్ రావు, దయాకర్ రావు ఇవాళ రాష్ట్రంలో తిరుగుతూ రైతు ల పై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.14 వందల మంది బిడ్డలు త్యాగం చేస్తే వచ్చిన తెలంగాణ లో పదేళ్లు కన్ను మిన్ను కనకుండా ప్రజల ను దోసుకొని ఆస్తుల సంపాదించుకొని కులికిన బి.ఆర్.ఎస్ నేతలు ఇవాళ పార్లమెంట్ ఎన్నికల కోసం డ్రామాలు మొదలెట్టిన రని జంగా మండిపడ్డారు.గతంలో తాను డిసిసిబి చైర్మైన్ గా జిల్లాలో రైతాంగం కు ఇన్ ఫుట్ సబ్సిడీ, డ్రిఫ్,ఇరిగేషన్ కు,క్రాప్ లోన్లు.. ఇతర రుణాల సహాయం అందించి ఆదుకున్న విషయం జిల్లా ప్రజలకు తెలుసన్నారు.దయాకరరావు నీవు ఓట్ల లో నీకు బుద్ధి చెప్పిన సిగ్గు లేకుండా రైతులకు అన్యాయం జరుగుతుందని పెడబొబ్బలు పెడుతున్నావు..రైతు అభివృద్ధి పై కాంగ్రెస్ ప్రభుత్వాల చిత్తశుద్ధి పై చర్చ సిద్ధమా..?? పాలకుర్తి నడిగడ్డ కు వస్తావా..??ని పార్వతగిరి కి రమ్మంటావా.??హన్మకొండ కాళోజీ సెంటర్ బహిరంగ చర్చ కు వస్తావా.. మీ పార్టీ వస్తుందా అని జంగా సవాల్ విసిరారు.ఇక బిజెపి మతం పేరు చెప్పి ఓట్ల ను పొందాలని అనుకుంటున్నదని కానీ తెలంగాణా సమాజంలో కమ్యూనిస్టు భావజాలం ఎక్కువ అని అందుకని బీజేపీ ఇక్కడ నూకలు చెల్లవన్నారు.ఫోన్ ట్యాపింగ్ లో దయాకరరావు తప్పకుండా జైలు కు పోతాడాని..గతం లో దయాకరరావు దొంగ బుద్ది తో తన తో పాటు.తన అనుచరుల ఫోన్ లను చట్టవ్యతిరేకమైన పద్దతులలో ట్యాపింగ్ చేసి ఎన్నికల్లో లబ్ధి పొందినడాని జంగా ఆరోపించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana