Home తెలంగాణ నారా భువనేశ్వరిని కలిసిన కానిస్టేబుల్ పై వేటు 

నారా భువనేశ్వరిని కలిసిన కానిస్టేబుల్ పై వేటు 

0

posted on Mar 21, 2024 10:54AM

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల  కోడ్ అమలవుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు కుటుంబ సభ్యులపై అధికారులు ఫోకస్ పెట్టారు 

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని కలిసిన కానిస్టేబుల్‌ సాకిరి రాజశేఖర్‌పై వేటు పడింది. ఈ మేరకు  సస్పెండ్‌ చేస్తూ తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌ ఉత్తర్వులు జారీచేశారు. తిరుపతి దిశ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌ రాజశేఖర్‌  అన్నమయ్య జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొనేందుకు భువనేశ్వరి తిరుపతి జిల్లా భాకరాపేట మీదుగా వెళ్తుండగా కలిశారు. కానిస్టేబుల్‌పై ఫిర్యాదులు రావడంతో విచారణ అనంతరం ఆయన్న సస్పెండ్‌ చేసినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది తమ వ్యక్తిగత అభిప్రాయాలను బహిర్గతం చేయడం.. రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి వాటిని ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పరిగణించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అధికారులు ఎన్నికల కోడ్ అమలు చేయడం సబబే . కాని వైసీపీ ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికార దుర్వినియోగం అవుతుంది. వాలంటీర్లను చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఎస్ పి ఎన్నికల కమిషన్ పరిధిలో వస్తారు అయినా అధికార పార్టీ వ్యవహారాల్లో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. 

Exit mobile version