ఐఐటీ తిరుపతి క్యాంపస్లో ఇంజనీరింగ్, సైన్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ Social Science విభాగాల్లో పిహెచ్డి ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. పీజీ (PG) కోర్సుల్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ ఇన్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.ఐఐటీలో ఎంటెక్ Mtech ప్రవేశాల కోసం కూడా దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైంది. మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ కోర్సులో కూడా అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. మాస్టర్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్, పిహెచ్డి కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ మార్చి 13నుంచి ప్రారంభించారు. ఏప్రిల్ 10వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎంటెక్, మాస్టర్ ఆఫ పబ్లిక్ పాలసీ కోర్సులకు మార్చి 20వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 19వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మరిన్ని వివరాలు www.iittp.ac.in/admissions లో అందుబాటులో ఉంటాయి.