Home ఆంధ్రప్రదేశ్ AP Fishing Ban : ఏపీలో ఏప్రిల్ 15 నుంచి చేపల వేట నిషేధం, ఫిషింగ్...

AP Fishing Ban : ఏపీలో ఏప్రిల్ 15 నుంచి చేపల వేట నిషేధం, ఫిషింగ్ బోట్లకు నో పర్మిషన్

0

వేట నిషేధం ఎందుకంటే?

సముద్ర జలాల్లో చేపల వేట నిషేధం ముఖ్య ఉద్దేశం… పలు రకాల చేప, రొయ్య జాతుల సంతానోత్పత్తి అని అధికారులు తెలిపారు. ఈ కాలంలో తల్లి చేపలను, రొయ్యల సంరక్షణ, వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించేందుకు ఏటా వేట నిషేధం విధిస్తామన్నారు. దీంతో సముద్ర మత్స్య సంపద పెరుగుతోందన్నారు. ఈ నిషేధ ఉత్తర్వులను పాటిస్తూ ఆ సమయంలో సముద్ర జలాల్లో మెకనైజ్డ్, మోటారు బోట్లపై మత్స్యకారులు ఎలాంటి చేపల వేట చేయకుండా మత్స్య అభివృద్ధికి సహకరించాలని అధికారులు కోరారు. అయితే వేప నిషేధం సమయంలో స్థానిక ప్రభుత్వాలు మత్స్యకారులకు ఆర్థిక సాయం అందిస్తుంటాయి. అయితే ఈసారి ఎన్నికల కోడో కారణంగా ఆర్థిక సాయం నిలిచిపోనుంది. ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని మత్స్యకారులు కోరుతున్నారు.

Exit mobile version