Thursday, January 23, 2025

సైలెంట్ సెన్సేషన్ వైఎస్ వివేకా బయోపిక్! | viveka bio pic silent sensation| www| viveka| biopic| com| march| 22

posted on Mar 20, 2024 4:33PM

ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తొలుత వైసీపీ అగ్రనేత విజయసాయి రెడ్డి సహా ఆ పార్టీ ముఖ్యులంతా వైఎస్ వివేకా గుండెపోటుతో మరణించారంటూ ప్రకటనలు గుప్పించారు. ఆ తరువాత వైఎస్ వివేకా మరణానికి గుండెపోటు కాదు గొడ్డలిపోటు కారణమని తేలింది.  

తొలుత వైసీపీ అధినేత జగన్ , ఆ పార్టీ నేతలు ఈ హత్య వెనుక తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ స్థానిక నేతలూ ఉన్నారంటూ ఆరోపణలు గుప్పించారు. అయితే దర్యాప్తులో ఈ హత్యతో తెలుగుదేశం అధినేతకు కానీ, ఆ పార్టీ నేతలకు కానీ ఎటువంటి సంబంధం లేదని రుజువు కావడమే కాకుండా, వివేకాను హత్య చేసింది అయినవాళ్లే అని తేలింది.  దారుణ హత్య వెనుక అయినవాళ్లే ఉన్నారంటూ వివేకా కుమార్తె సునీత కూడా చెబుతున్నారు. తన తండ్రి హంతకులకు శిక్ష పడాలంటూ ఆమె అలుపెరుగని న్యాయపోరాటం చేస్తున్నారు.  వివేకా  హత్య జరిగి ఐదేళ్లు అవుతున్నా ఇంతవరకు దోషులకు శిక్ష పడలేదు. ఈ క్రమంలో వైఎస్ వివేకా బయోపిక్ తెరమీదకు రావడం సంచలనంగా మారింది.

‘వివేకం’ పేరుతో వైఎస్ వివేకా బయోపిక్ రూపొందింది. ఈ చిత్ర దర్శక నిర్మాతలు ఎవరనే విషయం రివీల్ కాలేదు కానీ.. ‘వివేకా బయోపిక్’ అనే యూట్యూబ్ ఛానల్ లో ట్రైలర్ ను విడుదల చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ కింద డిస్క్రిప్షన్ లో పేర్కొన్నారు. వివేకా హత్యకు ముందు తర్వాత జరిగిన సంఘటనలను చూపిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. అంతేకాదు ఈ సినిమాను మార్చి 22న విడుదల చేయనున్నట్లు తెలిపారు.  అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదల కావడంలేదు. ‘www.vivekabiopic.com’ అనే వెబ్ సైట్ ద్వారా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు.  అత్యంత సెలెంట్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న వివేకా బయోపిక్ ఎలాంటి పొలిటికల్ సెన్సేషన్ క్రియోట్ చేస్తుందన్నది చూడాలి.  

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana