Home అంతర్జాతీయం వీళ్లు ‘రైట్ బ్రదర్స్’ కు తక్కువేం కాదు; మారుతి వేగన్ ఆర్ కారును ఏకంగా హెలీకాప్టర్...

వీళ్లు ‘రైట్ బ్రదర్స్’ కు తక్కువేం కాదు; మారుతి వేగన్ ఆర్ కారును ఏకంగా హెలీకాప్టర్ గా మార్చేశారు..

0

టెయిల్, రోటర్ బిగించారు..

ఈ సోదరులిద్దరూ ముందుగా, ఒక పాత మారుతి వ్యాగన్ ఆర్ కారు ను కొనుగోలు చేశారు. ఈ కారును హెలీకాప్టర్ గా మార్చి, వివాహాల్లో వధూవరులను తీసుకువెళ్లడానికి ఆ చాపర్ ను ఉపయోగించి డబ్బు సంపాదంచాలని అనుకున్నారు. వెంటనే, పని ప్రారంభించారు. కారు పై భాగంలో స్క్రాప్ మెటల్ తో తయారు చేసిన రోటర్ ను, వెనుక భాగంలో టెయిల్ ను వెల్డింగ్ చేసి బిగించారు. టెయిల్ రోటర్ ను కారు యొక్క బూట్ లోకి వెల్డంగ్ చేశారు. ఇంజన్ లోనూ స్వల్ప మార్పులు చేశారు. కారులో క్యాబిన్ ను ఏర్పాటు చేశారు. వీటన్నింటి కోసం దాదాపు రూ. 2.5 లక్షలను ఖర్చు చేశారు. పెళ్లిళ్ల సీజన్ లో వధూవరులను తీసుకెళ్లడానికి ఈ మోడిఫైడ్ మారుతి వ్యాగన్ఆర్ హెలికాప్టర్ ను ఉపయోగించాలని ఈశ్వర్ దీన్, అతని సోదరుడు ప్లాన్ చేశారు.

Exit mobile version