Home తెలంగాణ తెలంగాణ పాలిసెట్ పరీక్ష వాయిదా, మే 24న ఎగ్జామ్-hyderabad ts polycet 2024 exam postponed...

తెలంగాణ పాలిసెట్ పరీక్ష వాయిదా, మే 24న ఎగ్జామ్-hyderabad ts polycet 2024 exam postponed to may 24th due to lok sabha elections ,తెలంగాణ న్యూస్

0

TS PolyCET 2024 : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections)నేపథ్యంలో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష(TS PolyCET 2024) వాయిదా పడింది. ఈ పరీక్షను మే 24న నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ, ట్రైనింగ్ బోర్డు ప్రకటించింది. తెలంగాణ పాలిసెట్‌-2024 నోటిఫికేష‌న్(PolyCET Notification) ఇటీవల విడుద‌లైంది. 2024-25 విద్యాసంవ‌త్సరానికి ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నాల‌జీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్ నిర్వహించనున్నారు. పదో తరగతి(SSC Exams) లేదా త‌త్సమాన ప‌రీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు, ప్రస్తుతం ఎస్ఎస్సీ ప‌రీక్షలు రాస్తున్న విద్యార్థులు పాలిసెట్ రాత‌ప‌రీక్షకు అప్లై చేసుకోవ‌చ్చు. ఫిబ్రవరి 15 నుంచి అప్లికేషన్లు ప్రారంభం కాగా, ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 22 వరకు అప్లికేషన్లు(PolyCET Applications) స్వీకరించనున్నారు.

Exit mobile version