నెటిజన్ల స్పందన
ఈ ట్వీట్ ను గంట క్రితం ఎక్స్ లో షేర్ చేశారు. నిమిషాల్లోనే ఇది 5వేలకు పైగా వ్యూస్ సాధించింది. దీనిపై శాఖాహార నెటిజన్లు తమ సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెట్టారు. “ధన్యవాదాలు, ఒకసారి నా వెజ్ ఫుడ్ లో చికెన్ వచ్చింది!” అని ఒక వ్యక్తి పోస్ట్ చేశాడు. మరొకరు ‘‘నిజమే. శాకాహారులు కేవలం వెజిటేరియన్ రెస్టారెంట్ల నుండి మాత్రమే తినడం, ఆర్డర్ చేయడం చాలా సౌకర్యవంతంగా భావిస్తారు. వారి ఫుడ్స్ ను ఎలా ప్రిపేర్ చేస్తారనేది వారికి అతిపెద్ద ఆందోళన. ప్రత్యేక పాత్రలు, నూనెలు వాడుతున్నారా లేదా? అన్న విషయాన్ని పట్టించుకుంటారు’’ అని మరో యూజర్ స్పందించారు. ‘‘ఇది మరొక యాప్ లా ఉంటుందా? లేక ప్రస్తుతం ఉన్న జొమాటో (Zomato) యాప్ లోనే ఈ వెజ్ మోడ్ ఉంటుందా?” అని మూడవ వ్యక్తి ప్రశ్నించాడు. ‘‘నేను 3-స్టార్ రిసార్ట్ లో పనిచేశాను. వంట ఎలా చేయాలో నాకు తెలుసు. శాకాహారంలో నాన్ వెజ్ వండిన నూనెను ఉపయోగించడం చాలా సాధారణం’’ అని మరో వ్యక్తి వెల్లడించారు.