కర్ణాటక రాజధాని ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరులో తీవ్ర నీటి సంక్షోభం నెలకొంది. రోజుకు 2 వేల 600 MLD అంటే మిలియన్ లీటర్స్ పర్ డే నీటి అవసరం ఉంది. ఇందులో దాదాపు 500 MLD కొరత ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. సోమవారం అధికారులతో సమావేశమైన ఆయన.. సమస్య పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళికలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి సరఫరాకు నిధుల కొరత లేదన్ని సిద్ధరామయ్య.. భవిష్యత్తులో ఈ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.