భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్యకు వెళితే బీజేపీలో చేరుతున్నట్టా అని ప్రశ్నించారు. తానేమిటో తమ పార్టీకి తెలుసునని అన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. స్వలాభం గురించి కొంతమంది పార్టీ విడుతున్నారని విమర్శించారు. అలాంటి వారికి తర్వలోనే బుద్ది చెబుతామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.