Home క్రికెట్ Rishabh Pant: రిషబ్ పంతే కెప్టెన్.. అధికారికంగా ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్: వివరాలివే

Rishabh Pant: రిషబ్ పంతే కెప్టెన్.. అధికారికంగా ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్: వివరాలివే

0

Rishabh Pant – IPL 2024: భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్‍కు సిద్ధమయ్యాడు. 2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురైన అతడు ఆ తర్వాత ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్ అయిన అతడు 2023 సీజన్ ఆడలేకపోయాడు. అయితే, ఇటీవలే రిషబ్ పంత్ పూర్తిగా ఫిట్‍నెస్ సాధించాడు. దీంతో ఐపీఎల్ 2024 ఆడేందుకు రెడీ అయ్యాడు. అయితే, చాలా విరామం తర్వాత ఆడుతుండటంతో వెంటనే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీని అతడికి ఇస్తారా లేదా అనే టెన్షన్ నెలకొంది. అయితే, ఈ విషయంపై నేడు (మార్చి 19) అధికారిక ప్రకటన చేసింది ఢిల్లీ ఫ్రాంచైజీ.

Exit mobile version