ఫిబ్రవరిలోనే విరాట్ కోహ్లీ రెండోసారి తండ్రి అయ్యాడు. కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు రెండో సంతానంగా మగపిల్లాడు జన్మించారు. అతడికి అకాయ్ అని పేరు పెట్టారు ఈ స్టార్ దంపతులు. అయితే, ఈ కారణంగా ఇంగ్లండ్‍తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‍కు కోహ్లీ దూరమయ్యాడు. దీంతో ఐపీఎల్ 2024 సీజన్‍కు కోహ్లీ వస్తాడా లేదా అనే టెన్షన్ నెలకొంది. అయితే, ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చాడు కింగ్. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.