బీఆర్ఎస్ పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. బీఆర్ఎస్ పార్టీని విడిచి పెట్టి వెళ్లేదే లేదన్నారు. తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ముందుండి పని చేస్తాని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. వరంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశానని అన్నారు. వైఎస్సార్ ఎన్నో ఇబ్బందులు పెట్టినా పార్టీ మారలేదని గుర్తు చేశారు. తన పేరు చెప్పాలని ప్రణీత్‌రావు మీద ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.