Home ఆంధ్రప్రదేశ్ AP Summer Holidays : ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఈసారి ముందుగానే వేసవి సెలవులు!

AP Summer Holidays : ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఈసారి ముందుగానే వేసవి సెలవులు!

0

ఒంటిపూట బడులు ప్రారంభం

ఏపీ వ్యాప్తంగా మార్చి 18 నుంచి ఒంటిపూట బడులు(AP Half Day Schools) ప్రారంభం అయ్యాయి. విద్యాశాఖ ఆదేశాల మేరకు 1వ తరగతి నుంచి 9వ తరగతి (1 to 9th Class) వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు విద్యార్థులకు ఒంటిపూట తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, అన్ ఎయిడెట్, మెడల్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్, జిల్లా పరిషత్ పాఠశాలల్లో హాప్ డేస్ నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించిన సంగతి తెలిసిందే. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 23వ తేదీ వరకు రాష్ట్రంలోని స్కూళ్లకు ఒంటిపూట బడులు నిర్వహించారు. పదో తరగతి(AP SSC Exams) పరీక్షా కేంద్రాలుగా ఉన్న స్కూళ్లలో పరీక్షలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఒంటిపూట బడుల సమయంలో మధ్యాహ్నం భోజనం(Midday Meal) తర్వాతే విద్యార్థులను ఇంటికి పంపాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. నిర్దేశించిన మెనూ ప్రకారమే విద్యార్థులకు మధ్యాహ్న భోజనాలు అందించాలని అధికారులు పేర్కొ్న్నారు.

Exit mobile version