Wednesday, January 15, 2025

దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ సమన్లు, సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వెనక్కి తీసుకున్న కవిత-hyderabad brs mlc kavitha withdraw petition in supreme court challenge ed summons ,తెలంగాణ న్యూస్

ఈడీ ప్రకటన

మార్చి 15న హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు(Raids) నిర్వహించారు. ఆ సమయంలో ఈడీ అధికారులను కవిత బంధువులు, సన్నిహితులు అడ్డుకున్నారని ఈడీ ప్రకటనలో తెలిపింది. ఎమ్మెల్సీ కవితతో పాటు మరికొందరు కలిసి దిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కు ప్లాన్ చేశారని ఈడీ విచారణలో తేలిందని వెల్లడించింది. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), ఆప్ నేత మనీష్ సిసోడియా ఎక్సైజ్ పాలసీ(Delhi Excise Policy) రూపకల్పన, అమలులో అవకతవలకు పాల్పడ్డారని తన విచారణలో తెలిసిందని చెప్పింది. ఈ కుట్రలో కవిత పాత్ర కూడా ఉందని ఈడీ తెలిపింది. తమకు అనుకూలంగా లిక్కర్ పాలసీ రూపొందించేందుకు కవిత ఆప్ నేతలకు రూ.100 కోట్లు చెల్లించారని ఈడీ అభియోగించింది. అవినీతికి పాల్పడే ఉద్దేశంతోనే దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపొందించారని, అక్రమ మార్గంలో ఆప్ నేతలకు నిధులు అందాయని తెలిపింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana