రాబోయేది మోదీ ప్రభుత్వమేనని, ఆయన చేసిన అభివృద్ధి ఏ ఇతర పార్టీలు చెయ్యలేదని, దేశం గర్వించే ఎన్నో సాహసమైన నిర్ణయాలు ఆయన తీసుకున్నారని, అందుకే దేశ ప్రజలు మరలా కేంద్ర ప్రభుత్వంలో మరల మోదీకే పట్టం కడతారని, చేవెళ్ల అభ్యర్థిగా నిలబడిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మహేశ్వరం భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అందెల శ్రీరాములు, కామారెడ్డి బిజెపి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ పరిధిలో గల సికెఆర్ టీకేఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన “భాజపా విస్తృతస్థాయి కార్యకర్తల” సమావేశంలో వారు ఈ మాటలను వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి గద్దె ఎక్కడం జరిగిందని, మరల వారి యొక్క మాయమాటలు నమ్మి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి ప్రజలు ఓట్లు వేయరని, ఏ ప్రభుత్వమైన అధికారం చేపట్టాలన్న కార్యకర్తలు కష్టపడి ప్రజలను మెప్పిచ్చి ఓట్లు వేయిపిస్తేనే, తాము అధికారం చేపడతామని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి బిజెపి శ్రేణులు అత్యధికంగా పాల్గొన్నారు.