ఒక కాకి చనిపోతే 100 కాకులు మనోవేదనను ప్రకటిస్తు మానవతా విలువలు చాటి చెప్తున్నాయని , కానీ చివరకు కాకుల్లో ఉన్న మానవతా విలువలు మనుషుల్లో లేకపోవడం తాన మనస్సును చాలా బాధ కలిగిస్తుందని, తెలంగాణ మాజీ మంత్రి మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి, బడంగ్పేట్ మున్సిపల్ పరిధిలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె ఈ మాటలను వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. తాజాగా కొన్ని రోజులు ముందు వరకు కేసిఆర్ కు గులాం గిరి చేసిన వాళ్లు, ప్రస్తుత కష్ట కాలంలో ఆయనకు సంఘీభావం ప్రకటించకుండా, ఎవరు స్వార్ధం వారు చూసుకుంటున్నారని ఆమె అక్రోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ యొక్క ప్రస్తుత పరిస్థితులలో ప్రతి కార్యకర్త తన మీద ఎంత గౌరవం ఉంచి తనను ఎమ్మెల్యేగా గెలిపించారో, కెసిఆర్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థిని ఎవ్వరిని ప్రకటించిన ఆయనను అత్యధికంగా మెజార్టీతో గెలిపించి కెసిఆర్ కు గిఫ్టుగా మనo ఇద్దామని ఆమె పేర్కొన్నారు. రాబోయే 24వ తారీఖు నాడు భారీ ఎత్తున కార్యకర్తల మీటింగ్ జరుగుతుందని, మీరు అందరూ హాజరై మీటింగ్ లో జయప్రదం చేయాలని ఆమె కార్యకర్తలను కోరారు. అనంతరం బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు అత్యధికంగా పాల్గొన్నారు.