Smriti Mandhana: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీకి 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తొలి టైటిల్ దక్కింది. ఐపీఎల్‍లో ఆర్సీబీ పురుషుల జట్టుకు 16 సీజన్లుగా టైటిల్ అందని ద్రాక్షగానే ఉంది. అయితే, భారత స్టార్ స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ మహిళల జట్టు డబ్ల్యూపీఎల్ రెండో సీజన్‍లోనే టైటిల్ సాధించి అదరగొట్టింది. ఆదివారం జరిగిన డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై ఘన విజయం సాధించిన బెంగళూరు విజేతగా నిలిచింది. ఆర్బీసీ పురుషుల జట్టు తరఫున 16ఏళ్లుగా ఆడుతున్న భారత స్టార్ విరాట్ కోహ్లీ.. ఈ సందర్భంగా మహిళల టీమ్‍కు వీడియో కాల్ చేశారు.