Home వీడియోస్ RS Praveen Kumar: ప్యాకేజీల కోసం కాదు.. ప్ర‌జాసేవ కోస‌మే బీఆర్ఎస్‌లోకి..!

RS Praveen Kumar: ప్యాకేజీల కోసం కాదు.. ప్ర‌జాసేవ కోస‌మే బీఆర్ఎస్‌లోకి..!

0

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవి ఆఫర్ చేసినట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బు, పదవికి అమ్ముడుపోయే వ్యక్తి ప్రవీణ్ కాదని స్పష్టం చేశారు. బహుజన వాదం కోసం పని చేసే వ్యక్తిని అని అన్నారు. కేసీఆర్ ని నమ్మి, బీఆర్ఎస్ లో చేరుతున్నానని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి గేట్లు తెరిస్తే పిరికిపందలు, అసమర్థులు, స్వార్థపరులు గొర్రెల మందల వెళ్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆర్ఎస్ ప్రవీణ్ ఆ గొర్రెల మందలో ఒకడు కాదని అన్నారు.

Exit mobile version