ఆశిష్ గాంధీ, అశోక్ హీరోలుగా వర్ష, హ్రితిక హీరోయిన్లుగా రాజశేఖర్ రావి దర్శకత్వం వహించిన చిత్రం ‘హద్దు లేదురా’. ఈ నె 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం మూవీ ట్రైలర్ లాంచ్ చేశారు. ముఖ్య అతిథిగా దర్శకుడు గోపీచంద్ మలినేని హాజరయ్యారు. గోపిచంద్ మాట్లాడుతూ ‘ట్రైలర్ చాలా బాగుందన్నారు. దర్శకుడు రాజశేఖర్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినట్లు అనిపించలేదన్నారు. మొదటి సినిమా బర్త్ లాంటింది.. నా మొదటి సినిమా డాన్ శీను ఇప్పటికీ మర్చిపోలేనన్నారు.