ఫైటర్ గురించి..
ఫైటర్ సినిమాలో హృతిక్ రోషన్ సరసన దీపికా పదుకొణ్ హీరోయిన్‍గా నటించారు. ఈ చిత్రానికి సిద్ధార్థ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అనిల్ కపూర్, కరణ్ సింగ్, అక్షయ్ ఒబెరాయ్, రిషబ్ సాహ్నీ, అషుతోశ్ రాణా, గీతా అగర్వాల్, తలాత్ అజీజ్ కీలకపాత్రలు పోషించారు. ఎయిర్ ఫోర్స్ పైలెట్లు చేసే ఓ మిషన్ చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉంటుంది. ఈ చిత్రానికి సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా, విశాల్ – చంద్రశేఖర్ సంగీతం అందించారు.