BRS Party| ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు BRS ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో పాడి కౌశిక్ రెడ్డి, వెంకటేశ్, గోపాల్, బండారు లక్ష్మారెడ్డితో పాటు పలువురు నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరామని తెలిపారు. చర్యలు తీసుకుంటామని స్పీకర్ చెప్పినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ తరపున గెలిచి మరో పార్టీలో చేరే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.