అనామిక మాటలు ఇంట్లో వాళ్లంతా ఆశ్చర్యంగా చూస్తారు. భార్య ఫ్రెండ్స్‌ను కలవనంతా బిజీనా అని వాళ్లు అంటే.. అవును, 23 బ్రాంచ్‌లు కదా అన్ని ఒక్కడే చూసుకుంటాడు. అందుకే అంత బిజీ అని అనామిక అంటుంది. అవును అవును అని ధాన్యలక్ష్మీ అంటుంది. మరి కావ్య వాళ్ల భర్త ఏం చేస్తారు అని అనామిక ఫ్రెండ్స్ అడుగుతారు. ఆయన కూడా చేస్తారు. కానీ, మా వారికి హెల్ప్ చేస్తారు అని అనామిక అంటుంది. దాంతో అపర్ణ, కావ్య, ఇందిరాదేవి షాక్ అవుతుంది.