టాటా పంచ్ ఎస్యూవీ..
అఫార్డిబుల్, బెస్ట్ ఎస్‌యూవీల్లో టాటా పంచ్ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. ఫిబ్రవరి నెలలో టాప్ 10 బెస్ట్ ఎస్‌యూవీల్లో నెంబర్ 1 ప్లేస్‌ని దక్కించుకుంది పంచ్. స్టైలిష్ డిజైన్‌తో పాటు డ్యూయెల్ టోన్ పెయింట్, ప్రొజెక్టర్ హాలోజెన్ హెడ్‌లైట్స్, మస్క్యూులర్ బానెట్, రూఫ్ రెయిల్స్, వైడ్ ఎయిర్ డ్యామ్ వంటివి వస్తున్నాయి. ఇందులో 15 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఉంటాయి. ఇక 5 సీటర్ స్పెషియస్ కేబిన్‌లో 7 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, స్టార్ట్/ స్టాప్ బటన్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, యాపిల్ కార్ప్లే, అండ్రాయిడ్ కార్ప్లే వంటివి ఫీచర్స్‌గా ఉన్నాయి.