మేడ్చల్ జిల్లా జీడిమెట్ల :- మాజీ మంత్రి మల్లారెడ్డి అక్రమాలు ఇకపై సాగవు.ఇన్ని రోజులు బి అర్ ఎస్ ప్రభుత్వం లో దోచుకుని,దాచుకున్న ప్రతి పైసా బైటికి వస్తుందన్నారు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్.మైనం పల్లి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నక్క ప్రభాకర్,జంగయ్య యాదవ్ తో కలిసి మెదక్ ఎమ్మెల్యే మైనం పల్లి రోహిత్.మల్లారెడ్డి యూనివర్సిటీ లో చదువుతున్న విద్యార్థుల కు అన్యాయం జరిగితే వూరుకునే ప్రసక్తి లేదన్నారు రోహిత్.గత కొద్ది రోజులుగా మెదక్ నియోజక వర్గానికి చెందిన విద్యార్థులు వారి బాధను తనతో చెప్పుకుంటున్నారని,అవగాహన లేని వారు కళాశాల నడుపుకుంటూ విద్యార్థులను,వారి తల్లి తండ్రులను హింస పెడుతున్నారని అన్నారు ఎమ్మెల్యే మైనం పల్లి రోహిత్.మల్లా రెడ్డి కుటుంబం విద్య,వైద్యం,రాజకీయం పేరుతో కోట్లు దండుకంటున్నారని …విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్.