Monday, January 20, 2025

కాంగ్రెస్ గేట్లు తెరిస్తే చేరడానికి అసమర్థుడిని కాదు, బీఆర్ఎస్ లో చేరుతున్నా- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్-hyderabad rs praveen kumar says join brs rejected cm revanth reddy offered tspsc chairman ,తెలంగాణ న్యూస్

ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చా

కాంగ్రెస్ (Congress)గేట్లు తెరిస్తే చాలా మంది పిరికిపంద‌లు, స్వార్థప‌రులు, అస‌మ‌ర్థులు గొర్రెల మంద‌లాగా వ‌స్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) విమర్శించారు. ఆ గొర్రెల మంద‌లో ప్రవీణ్ కుమార్ ఒకడు కాదన్నారు. ఎంత ప్యాకేజీ తీసుకున్నావని సోష‌ల్ మీడియాలో అంటున్నారని, ప్యాకేజీలకు ఆశ‌ప‌డితే అధికార పార్టీలోనే చేరేవాడినన్నారు. తెలంగాణ అభివృద్ధి అనే య‌జ్ఞం కోసమే బీఆర్ఎస్‌లో చేరుతున్నానన్నారు. ఆస్తుల‌ను ర‌క్షించుకోవ‌డానికి భ‌యంతో కాంగ్రెస్ లోకి పారిపోయిన పిరికిపంద‌ను కానన్నారు. ఉద్యోగాన్ని వ‌దుల‌ుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చానన్నారు. కేసీఆర్ ఇచ్చిన అవ‌కాశంతో పదేళ్లలో ప‌ది ల‌క్షల మంది విద్యార్థుల‌ను ప్రయోజ‌కులుగా తీర్చిదిద్దానని చెప్పారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బెదిరించడం మానుకోవాలన్నారు. వార్నింగ్‌లు ఇచ్చి సీఎం హోదాను త‌గ్గించుకోవద్దని సూచించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana